calender_icon.png 23 February, 2026 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

23-02-2026 12:21:08 AM

  1. మేయర్ కొలగాని శ్రీనివాస్

మేయర్‌గా బాధ్యతలు స్వీకరణ

కరీంనగర్, ఫిబ్రవరి 22 (విజయ క్రాంతి): నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే దిశగా మేము అడుగులు వేస్తామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన చాంబర్‌లో మేయ ర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రజల త్రాగు నీటి సరఫరా ఇబ్బందులు తొలగించడం, సమ్మర్ ఆక్షన్ ప్లాన్ లో భాగంగా  విలీన గ్రామాల డివిజన్ల 49 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు పరిపాలనాప రమైన మంజూరు కు పైల్ పై మేయర్ మొదటి సంతకం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని, పదవికి సహాకరించిన  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు రాంచంధర్ రావు, జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ లో మొట్ట మొదటి సారిగా భారతీయ జనతా పార్టీ నుండి మేయర్ పీఠం దక్కించుకోవడం శుభ సూచకమన్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పాలకవర్గ సభ్యల సహాకారంతో రాబోవు 5 సంవత్సరాల పాలకవర్గంలో 66 డివిజన్ల అభివృద్దే ద్యేయంగా పని చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాకారం, పాలకవర్గ సభ్యుల సహకారంతో నగరాన్ని మరింత  సుంధరంగా తీర్చి దిద్దుతామన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు, నగరపాలక సంస్థ లో పౌర సేవలు వేగవంతం గా అందేలా చర్యలు తీస్కుంటామన్నారు.

రాబోయే వేసవి కాలం దృష్ట్యా ప్రజల త్రాగు నీటి ఇబ్బందులు తొలగించేందుకు 49 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పరిపాలనాపరమైన మంజూరు ఇవ్వడం జరిగిందన్నారు. నూతనంగా విలీనం చెందిన గ్రామాల డివిజన్ల ను సమాంతరంగా అభివృద్ధి చేసి... ప్రజలకు సౌకర్యాలు కల్పించి... ఇబ్బందులు తొలగిస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపి పార్టీ జిల్లా అధ్యక్షులు కృష్ణా రెడ్డి, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.