లక్ష సాధనతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే కోవ
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ ౩౦ (విజయక్రాంతి): విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు లక్ష సాధన తో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు. పదవ తరగతి ఫలితాలలో జిల్లా వ్యాప్తంగా అద్భుత ప్రతిభ కనబరిచిన బి సి వసతి గృహాలు,గిరిజన ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాలకు చెందిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను,ఉపాధ్యాయులను గురువారం ఎమ్మెల్యే తన నివాసంలో డి డి రమాదేవి,మున్సిపల్ చైర్మన్ ఆకాష్ లతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ అహ్మద్, జి సి డి వో శకుంతల,పార్వతి, ఏ సి ఎం వో ఉద్దవ్, వార్డెన్లు చిరంజీవి, శ్రీనివాస్, బోగే మధుకర్, కౌన్సిలర్లు వెంకన్న, బాలకృష్ణ, సలాం బిన్ అహ్మద్ పాల్గొన్నారు.






