18 ఏళ్ల నిరీక్షణకు చరమగీతం పాడాలి
- ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు
- హామీలు కాదు.. బ్రిడ్జి నిర్మాణం కావాలంటూ బిజెపి నిరసన
ఘట్ కేసర్, ఆగస్టు 1 (విజయక్రాంతి) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్ కే సర్ పట్టణంలో 18 సంవత్సరాలుగా పూర్తి కాక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తు న్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఘట్ కేస ర్ డివిజన్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పా ర్టీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని అం బేద్కర్ చౌరస్తాలో భారీ శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈకార్యక్ర మానికి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బు ద్ధి శ్రీనివాస్, మేడ్చల్ నియోజకవర్గ బీజే పీ ఇన్చార్జ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఘట్ కేసర్ ప్రజలు దాదాపు 18 సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణం పూర్తికాక తీవ్ర ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాల భ యం, అత్యవసర సమయాల్లో ఆలస్యం వం టి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు పలుమార్లు హామీలు ఇచ్చినప్పటికీ గత ప్రభు త్వాలు ఈ కీలక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు.ప్రజల ప్రాణాలు, సమ యం అమూల్యమైనవని, ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యమని, బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కాకుంట్ల చంద్రారెడ్డి, కామారెడ్డి ఇంచార్జ్ పట్లోళ్ల విక్రంరెడ్డి, రాష్ట్ర నాయకులు రామోజీ, శోభ దామోదర్ రెడ్డి, హైమారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి టి లక్ష్మి, గోనె శ్రీనివాస్, మీడియా సేల్ కన్వీనర్ చలవాది ప్రవీణ్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు గొంగళ్ళ బాలేష్, బీజేవైఎం నాయకులు పసులాది చంద్రశేఖర్ ముదిరాజ్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, కార్యదర్శి పద్మా రెడ్డి, ప్రగతి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగం అర్జున్, ఘట్కేసర్ మండల అధ్యక్షులు బస్వ రాజు గౌడ్, డివిజన్ల అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






