దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
- టీఎన్‌జీవోఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌కుమార్
- కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
హైదరాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, హైదరాబాద్ జిల్లా కార్యాలయ ప్రాం గణంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎస్. విక్రమ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘స్వాతం త్య్ర సమరయోధుల నిస్వార్థ త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తు న్నాం.
యువత దేశభక్తి భావాలను పెంపొందించుకోవడమే కాకుండా, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. బాధ్యతా యుతమైన ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, దేశ సమగ్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ ముం దుండాలి’ అని పిలుపు నిచ్చారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసి డెంట్ కేఆర్ రాజ్ కుమా ర్, ఉపాధ్యక్షులు బొలిగడ్డ శంకర్, ప్రచార కార్యదర్శి వైదిక్ శ్రేష్ట, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఆర్. కృష్ణ, ఆఫీస్ పీఆర్‌ఓ మహమ్మద్ వాహెద్ తదితరులు పాల్గొన్నారు.






