26 June, 2026 | 6:10 PM

Breaking News

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

03-02-2026 03:14 PM

జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి

పాపన్నపేట: విద్యార్థులు పట్టుదలతో చదివి పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలోని భవిత సెంటర్ ను సందర్శించిన అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.