calender_icon.png 20 February, 2026 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో పీపీపీని ప్రోత్సహిస్తున్నాం

20-02-2026 12:23:20 AM

  1. అమెరికా టెక్ దిగ్గజాలతో కలిసి ముందుకు
  2. పెట్టుబడిదారులకు ఐటీ రంగంలో అనేక అవకాశాలు
  3. అమెరికా, ఇండియా వాణిజ్య మండలి ప్రతినిధులతో చర్చలు
  4. ఇండోనేషియా డిజిటల్ ప్రతిపాదనకు తెలంగాణ సానుకూలత
  5. నేషనల్ డిజిటల్ రోడ్‌మ్యాప్‌కు సాంకేతిక సహకారం
  6. ఏఐ ఇంపాక్ట్ సదస్సులోనూ మంత్రి శ్రీధర్ బాబు కీలకోపన్యాసం 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : అమెరికా టెక్ దిగ్గజాలతో కలిసి తెలంగాణలో పీపీపీ(ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం)ని ప్రోత్సహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మం త్రి శ్రీధర్ బాబు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్’ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

అమెరికా, ఇండియా వాణిజ్య మండ లి ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కృత్రిమ మేధ (ఏఐ) ఆవిష్కరణలకు తెలంగాణ వేదికగా ఉందని మంత్రి అన్నారు. పెట్టుబడిదా రులకు ఐటీ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.  తెలంగాణలో తమ ప్రభుత్వ స్థిరమైన విధానాల కారణంగా ఏఐ పరిశోధనలకు రాష్ట్రం వేదికగా మారింది. ప్రజాసేవల్లోనూ ఏఐ ద్వారా వేగంగా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ - జకార్తా మధ్య ‘టెక్నాలజీ స్కిల్ కారిడార్’

హైదరాబాద్- జకార్తా నగరాల మధ్య సాంకేతిక నైపుణ్యాల మార్పిడి కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని  మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇండోనేషియా డిజిటల్ పరివర్తన ప్రయాణంలో టెక్నాలజీ హబ్‌గా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న తెలంగాణ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

గురువారం న్యూఢిల్లీ భార త్ మండపంలో  ఇండోనేషియా కమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ అఫైర్స్ వైస్ మినిస్టర్ నెజార్ పాత్రియా  నేతృత్వంలోని అత్యున్న త స్థాయి బృందంతో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ, ఇండోనేషియా మధ్య డిజిటల్ భాగస్వామ్యం, స్కిల్ డెవలప్మెంట్, ప్రతిభావంతుల గుర్తింపు, టెక్నాలజీ ఇన్నోవేషన్స్, స్టార్టప్ ఎకో సిస్టం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు.

‘హైదరాబాద్ - జకార్తా టెక్నాలజీ స్కిల్స్ డెవలప్మెంట్ కారిడార్‘ ఏర్పాటుకు చొరవ చూపాలని నెజార్ పాత్రి యా కోరారు. తమ అంకుర సంస్థలకు, స్టార్ట ప్ ఎకో సిస్టం బలోపేతానికి మార్గ నిర్దేశం చేయాలని ఆహ్వానించారు. ఇండోనేషియా ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇం డోనేషియా డిజిటల్ పరివర్తనలో తెలంగాణ కీలక భాగ స్వామిగా ఉంటుందన్నారు.మన ఐ టీ ఎకో సిస్టం, అనుభవాన్ని ఇండోనేషి యా డిజిటల్ లక్ష్యాలకు అనుసంధానించడం ద్వారా ప్రపం చపటంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుందన్నా రు.   

ఏఐ భద్రతకు ప్రథమ ప్రాధాన్యం 

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భద్రతను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు అడ్డంకిగా కాకుండా, 21వ శతాబ్దపు ‘ఏరోడైన మిక్స్’గా భావిస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. డిజిటల్ గవర్నెన్స్ అడ్వయిజరీ,ఆల్ బ్రైట్ స్టోన్బ్రిడ్జ్ గ్రూప్  లాం టి గ్లోబల్ స్ట్రాటెజిక్ అడ్వయిజరీ సంస్థల ప్ర తినిధులు, ఏఐ సేఫ్టీ కనెక్ట్ సంస్థల నిపుణుల ను ఉద్దేశించి  ప్రసంగించారు.

నియంత్రణలు లేకుండా సాధించే వేగవంతమైన వృద్ధి త్రై మాసిక నివేదికల్లో అద్భుతంగా కనిపించవచ్చని, కానీ స రైన భద్రతా చర్యలు లేకుంటే జరిగే ఒక్క చి న్న పొరపాటు దశాబ్దాలుగా సంపాదించుకు న్న ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీస్తుందన్నారు. ఖ్యాతిని గడించడానికి 20 ఏళ్లు పడితే, దా నిని కోల్పోవడానికి కేవలం 5 నిమిషాలు చాలని బఫెట్ చెప్పినట్లుగానే.. నేడు ఏఐ వి షయంలో మ నం అ లాంటి కీలక కూడలిలోనే ఉన్నామన్నారు. 

షెన్జెన్లా మనదీ చారిత్రక ఘట్టమే

ప్రస్తుతం 80 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న హైదరాబాద్ వృద్ధిలో సగానికి పైగా మన టెక్ నిపుణుల కృషితోనే సా ధ్యమైందన్నారు. 1980లలో చిన్న మత్స్యకా ర గ్రామంగా ఉన్న చైనాలోని షెన్జెన్ ఆ స మయంలో తయారీ రంగంపై దృష్టి సా రించి నేడు 500 బిలియన్ డాలర్ల దిగ్గజ నగరంగా ఎదిగిందని మంత్రి ఉదహరించారు. తెలంగాణ కూడా ఇప్పుడు అటువంటి షెన్జెన్ ఘట్టం’లోనే ఉందని, కాకపోతే మన ఇంజిన్ తయారీ రంగం కాదని, టెక్నాలజీ అని స్పష్టం చేశారు.