6 August, 2026 | 2:47 AM

నోటీసులకు భయపడం

06-08-2026 12:40 AM

ప్రభుత్వ విప్ అద్దంకి  

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): క్షుద్రపూజలు ఎందుకు చేశావంటే హరీష్ రావు లీగల్ నోటీసులు పంపుతున్నాడు. పీసీసీ అధ్యక్షుడితో సహా ఎవరు వ్యతిరేక ంగా మాట్లాడినా వారికి లీగల్ నోటీసులు పంపాడు. హరీష్ రావు లీగల్ నోటీసులకు లీగల్‌గానే సమాధానం చెబుతామని ప్రభు త్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు.

బీఆర్ ఎస్ హయాంలో నోటీసులు కాదు, జైళ్లలో పెట్టినా పోరాటాలు చేశామని బుధ వారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది శివమొగ్గకు వెళ్లేటప్పుడు పోలీస్ అధికారిగా చెప్పుకొని వెళ్లాడన్న సమాచారం ఉందన్నారు. పవిత్ర క్షేత్రాల దగ్గరే క్షుద్ర శక్తుల పూజలు కూడా ఉంటాయన్నారు.