24 March, 2026 | 2:15 AM

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి

24-03-2026 12:42 AM

మున్సిపల్ చైర్మన్ కుసుమ వెంకట్ రత్నం బాబు 

కోదాడ, మార్చి 23 : కోదాడ పట్టణంలో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు ముమ్మరం చేయాలనీ కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. సోమ వారం కోదాడ మునిసిపల్ పరిధిలోని 21 వార్డు హుజూర్ నగర్ రహదారి పై పెట్రోల్ బంక్ ఎదురుగా మిషన్ భగీరథ మెయిన్ పైపు లైన్ మర్మమ్మత్తులను పరిశీలించి మాట్లాడారు. వేసవి లో నీటి సరఫరా సమస్యల పై మునిసిపల్ నీటి సరఫరా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

పైప్ లైన్ లీకేజీ లు రిపేర్ లపై వెంటనే స్పందించాలన్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే వార్డు ల్లో వాటర్ ట్యాంకర్ ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కమిషనర్ కు ఆదేశించారు.నిరుపయోగంగా ఉన్న బోర్లు గుర్తించి మరమ్మత్తులు చేయాలన్నారు. పట్టణ ప్రజలు ఏ సమస్య ఉన్నా స్థానిక కౌన్సిలర్ ద్వారా తన దృష్టి కి తేవాలన్నారు. సమస్యలను ఎమ్మెల్యే పద్మావతి సహరకారం తో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ రమాదేవి, కౌన్సిలర్ కట్టే బోయిన జ్యోతి శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తుంకోజు రంగా చారి పాల్గొన్నారు.