ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు
బూర్గంపాడు, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైన రెండో విడత వార్డు సభ్యుల శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. మండలంలోని అంజనాపురం, కృష్ణసాగర్, లక్ష్మీపురం, మోతెపట్టినగర్, ముసలమడుగు, నకిరిపేట, పినపాక పట్టినగర్, టేకులచెరువు, ఉప్పుసాక, వేపలగడ్డ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న 90 మంది వార్డు సభ్యులకు విధులు, బాధ్యతలు, పంచాయతీరాజ్ చట్టంపై శిక్షణ ఇచ్చినట్లు ఎంపీడీవో జమలారెడ్డి తెలిపారు.
అనంతరం వార్డు సభ్యులకు శిక్షణ పత్రాలను కూడా అందించారు. శిక్షణ తీసుకున్న వార్డు సభ్యులు ఎంపీడీవోను సత్కరించారు. టీవోటీలు ఎస్ కృష్ణ చైతన్య, బి వెంకటేష్, కే శ్రీనివాసరావు, సిహెచ్ కిరణ్ కుమార్, గ్రామ పంచాయితీల కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్స్, తదితరులు పాల్గొన్నారు.




