6 August, 2026 | 2:48 AM

సర్‌తో ఓటు భద్రం మంత్రి అజారుద్దీన్

06-08-2026 01:21 AM

మలక్పేట్, ఆగస్టు 5  (విజయ్ క్రాంతి):  ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని...  సర్లో ఓటును తప్పకుండా నమోదు చేసుకోవాలని రాష్ట్ర మంత్రి అజరుద్దీన్ అన్నారు. బుధవారం మలక్పేట్ నియోజకవర్గంలో ముసరాంబాగ్ డివిజన్ వడ్డెర బస్తి, ఇంద్రానగర్,  శాలివానగర్, ఎస్బిఐ కాలనీ, పాత మలక్పేట్ డివిజన్లోని పంచశీలు లైబ్రరీ తదితర ప్రాంతాలలో మంత్రి అజారుద్దీన్, మలక్పేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ షేక్ అక్బర్ ఇంటింటికి తిరుగుతూ సర్ లో ఓటు నమోదు చేసుకోవాలని కోరా రు.   సర్ తో ఓటు భద్రంగా ఉంటుందన్నా రు. ఆరోగ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొల్లు కిషన్, బాలకృష్ణ యాదవ్ , అశ్వక్, జాఫర్  తదితరులు పాల్గొన్నారు