3 July, 2026 | 11:36 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

కాళేశ్వరం బరాజ్‌ల సందర్శన

01-05-2026 01:48 AM

సాంకేతిక పరీక్షల పనులను పరిశీలించిన ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీబరాజ్, అన్నా రం సరస్వతి బరాజ్‌లను గురువారం ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భం గా మేడిగడ్డలో కొనసాగుతున్న బోర్ హోల్స్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్ట్‌ల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని సూ చించారు. అనంతరం అన్నారంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద అదనపు సిబ్బంది వసతి కొరకు గదులను పరిశీలించారు. అన్నారం ప్రాజెక్ట్ అప్ స్ట్రీమ్‌ను పరిశీలించి బోర్ హోల్స్ పనులను ప్రారంభించాలని ఆదేశించారు.