మృతుని కుటుంబానికి గ్రామస్తులు ఆర్థిక సాయం
01-04-2026 05:57 PM
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పర్ష గట్టు నెల రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో అతనికి తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు కరీంనగర్ లో ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గట్టు ఇటీవల మృతిచెందాడు.
పేదవాడైన మృతుని కుటుంబానికి పెద్ద మనసుతో గ్రామస్తులు జమ్ముచేసిన డబ్బులను రూ.19900 రూపాయలను గ్రామ సర్పంచ్ నక్క రాజేశ్వరి రాజయ్య, గ్రామస్తులతో కలిసి బుధవారం అందజేశారు. సర్పంచ్ వెంట గ్రామస్తులు తన్నీరు రాజేశం, నడిగొట్టి సది, కొండ సది, మంథని కుమార్, గొర్రె సమ్మయ్య, సమ్మయ్య, భాస్కర్, విశ్వరామ్, మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జమ చేసిన డబ్బులను మృతి చెందిన గట్టు కూతురు పాలసీ కింద అందజేశారు.




