8 June, 2026 | 7:20 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ

08-06-2026 05:48 PM

కరకగూడెం,(విజయక్రాంతి): విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలకు ముందుగా గుర్తొచ్చే పేరు లైన్‌ మెన్ జి. నరసింహ. మోతే ఫీడర్ పరిధి లో విధులు నిర్వహిస్తున్న ఆయన సేవా తపన, అంకితభావం, ప్రజల పట్ల ఉన్న బాధ్యతాభావం కారణంగా స్థానికుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. అందుకే గ్రామస్తులు ప్రేమగా ఆయన్ను "కరెంట్ దేవుడు" అని పిలుస్తున్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరా యం ఏర్పడినా, అది పగలైనా, అర్ధరా త్రైనా, వర్షం కురుస్తున్న సమయమైనా సరే నరసింహ వెంటనే స్పందిస్తారని ప్రజలు చెబుతున్నారు.

ఫోన్ కాల్ వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను గుర్తించి పరిష్కరిం చేందుకు కృషి చేస్తారని పేర్కొంటున్నారు. సాధారణ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పటికీ ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి విధులు నిర్వర్తించడం ఆయన ప్రత్యేకత. చాలామంది ఉద్యోగులు విధి నిర్వహణ ను బాధ్యతగా భావిస్తే, నరసింహ మాత్రం ప్రజాసేవను తన కర్తవ్యంగా భావిస్తూ పనిచేస్తున్నారని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. మోతే గ్రామానికి చెంది న రైతులు, స్థానికులు మాట్లాడుతూ, "రాత్రి రెండు గంటలైనా ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తారు.

కరెంట్ పునరుద్ధరణ అయ్యే వరకు అక్కడే ఉండి పని చేస్తారు. సమస్య పూర్తిగా పరిష్కారమైందని నిర్ధారిం చుకున్న తర్వాతే వెళ్తారు. ఇలాంటి ఉద్యోగులు చాలా అరుదు" అని కొనియా డుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, ఫీడర్ లైన్ల మధ్యే ఆయన సేవా ప్రయాణం సాగుతోంది. మండే ఎండ లోనూ, కుండపోత వర్షంలోనూ, చీకటి రాత్రుల్లోనూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం శ్రమిస్తుంటారు. పండుగలు, సెలవు లు, కుటుంబ కార్యక్రమాలను పక్కనపెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడట మే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు.

జీతం కోసం కాదు.. జనం కోసం పనిచేస్తా అనే ఆయన మాటలు ఆయన సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఒక రోగి ఇంట్లో కరెంట్ లేక ఇబ్బంది పడుతు న్నాడని తెలిసినా, రైతు మోటార్ ఆగిపో యిందని తెలిసినా నాకు నిద్ర పట్టదు. ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండటం నా బాధ్యత అని వినయంగా చెబుతారు. ఒకప్పుడు విద్యుత్ కార్యాలయానికి వెళ్లాలంటే ప్రజలు సంకోచించేవారని, ఇప్పుడు నరసింహ సార్ ఉన్నారు కదా అనే నమ్మకం ప్రజల్లో పెరిగిందని గ్రామస్తులు అంటున్నారు. చిన్నారులు సైతం ఆయనను ప్రేమగా "కరెంట్ మామ" అని పిలవడం ఆయనకు ఉన్న ప్రజాదరణకు నిదర్శనం. ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేది ఇలాంటి క్షేత్ర స్థాయి ఉద్యోగులేనని స్థానికులు అభిప్రా యపడుతున్నారు.

తమ విధులను నిజాయితీగా, నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తమవిగా భావించే జి. నరసింహ వంటి ఉద్యోగులు విద్యుత్ శాఖకు గర్వకారణమని కొనియాడుతు న్నారు. మోతే ఫీడర్ పరిధి ప్రజల తరఫు న ఈ సేవామూర్తికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి ఉద్యోగుల సేవలు మరెందరికో ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నారు. నరసింహ వంటి సేవాభావం కలిగిన ఉద్యోగులు ఉన్నంతకాలం కరకగూడెం ప్రజలకు విద్యుత్ కష్టాలు దరిచేరవు అని గ్రామ స్తులు సగర్వంగా చెబుతున్నారు.