ఉదయమే పనులు పూర్తి చేయాలి
సర్పంచ్ పంద్రం సురేష్
వాంకిడి,(విజయక్రాంతి): వేసవిలో ఉపాధి హామీ కూలీలు జాగ్రత్తలు తీసుకుంటూ పనులు నిర్వహించాలని సోనాపూర్ గ్రామ సర్పంచ్ పంద్రం సురేష్ అన్నారు. బుధవారం వాంకిడి మండలం సోనాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం పనులకు పరిశీలించి కూలీలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...9 గంటల నుండి వేసవి బాణుడు తమ ప్రస్తాపాన్ని చూపిస్తున్నాడని, ఉపాధి హామీ కూలీలు ఉదయం వేళలోనే పనులకు వెళ్లి పనులు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఎండలో పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులు నిర్వహించిన అనంతరం ఫోటో క్యాప్చర్ చేసుకొని వెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.






