1 April, 2026 | 9:27 PM

గ్రామ, మండలలొ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు

01-04-2026 07:25 PM

 ప్రత్యేక అధికారి జీవరత్నం వెల్లడి 

ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామ పంచాయతీలలో గురువారం గ్రామసభలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని మండల ప్రత్యేక అధికారి జీవరత్నం అన్నారు ఈ మేరకు ఖానాపూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులు వీఆర్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల  కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున గ్రామ సభలను పంచాయతీ సర్పంచ్లు పాలకమండలి సభ్యులు గ్రామ అధికారులు నిర్వహించాలని అన్నారు  ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి జీవరత్నం పలు సూచనలు చెశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాకాంత్ ,ఎంపీ ఓ రత్నాకర్ రావు, ఎంఈఓ సంధ్యారాణి ,తదితరులు పాల్గొన్నారు.