1 April, 2026 | 11:01 PM

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజ్… గ్రామంలో నీటి సమస్య

01-04-2026 09:04 PM

అక్కల దేవిగూడెంలో నీలమ్మ పుత్రిక వేంకట భవాని బోరు నీటితో ఉపశమనం

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండలం అక్కల దేవిగూడెం గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ పైప్‌లైన్ లీకేజ్ కారణంగా తీవ్ర నీటి సమస్య తలెత్తింది. పలు రోజులుగా పైప్‌లైన్ నుంచి నీరు లీక్ అవుతుండటంతో గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కోసం గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను గుర్తించిన అదే గ్రామానికి చెందిన దిగుటి వేంకట భవాని మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తన వ్యక్తిగత బోరు నుంచి నీటిని సరఫరా చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. కొంతమంది కుటుంబాలకు బోరు ద్వారా నీటిని అందిస్తూ వారి దాహార్తిని తీర్చుతున్నారు. గ్రామ ప్రజలు భవాని సేవను కొనియాడుతూ, ఇలాంటి క్లిష్ట సమయంలో ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పైప్‌లైన్ లీకేజ్‌ను మరమ్మతు చేసి గ్రామానికి మళ్లీ సాధారణ నీటి సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.