ఎస్ఆర్ఆర్ లో విద్యా వారోత్సవాలు ప్రారంభం
ముకరంపుర,(విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరీంనగర్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ... సోమవారం విద్యా వారోత్సవాలు ప్రారంభమైనందున అధ్యాపకులు, విద్యార్థులు అందరూ ఈ వారోత్సవాల్లో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
తెలంగాణ ప్రభుత్వం విద్యా ప్రాముఖ్యత గుర్తించి సృజనాత్మకతతో కూడిన విద్యతోనే సమాజ వికాసం సాధ్యమని అందు కొరకుగాను విద్యా విషయికమయిన అనేక సంస్కరణలు చేపడుతున్నందున ఈ సంస్కరణల ఫలితాలు అందరూ అందుకొని తెలంగాణ రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని యువత సర్వాంగీణవికాసం విద్య తోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.






