21 July, 2026 | 6:04 PM

నాసా పోటీల్లో వేములవాడ శ్రీ చైతన్య విద్యార్థుల ఘనత

21-07-2026 02:08 AM

వేములవాడ, జులై 20 (విజయ క్రాంతి): వేములవాడ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, నాసా సెలక్షన్కు ఎంపికయ్యారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ, మానవ జీవన విధానం, ఆహార లభ్యతపై సాయి శ్రీనివాస్ రాజు, ఆర్ సుప్రీత్, ఎల్ శివ కుమార్, ఎన్ ప్రమోద్, చౌదరి శివ కార్తీక్, ఎమ్ ఎ సిన్నాను, వి యువాన్, ఎస్ జశ్వంత్ ల బృందం రూపొందించిన ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో రెండవ స్థానం దక్కింది.

గత ఏడాది కూడా ఈ స్కూల్ విద్యార్థుల ’నోవా హోటల్ ప్రాజెక్టు’ జాతీయ గుర్తింపు పొందింది.నాసా లాంటి అంతర్జాతీయ కార్యక్రమాల్లో విద్యార్థులను ప్రోత్సహించిన పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను ఏజీఎం ముద్రకోల రాజు, ప్రిన్సిపాల్ సుదేశీ, డీన్ అంజయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్స్ అభినందించారు.