21 July, 2026 | 9:04 PM

బిచ్కుంద మున్సిపల్ చైర్ పర్సన్ సన్మానం

21-07-2026 06:01 PM

అన్ని పార్టీల కౌన్సిలర్లు గెట్ టు గెదర్ కు హాజరు

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ చైర్పర్సన్ సీమా షెట్కార్ మంగళవారం తన నివాస గగృహంల పార్టీలకతీతంగా కౌన్సిలర్ల తో గెట్ టు గెదర్ నిర్వహించారు. ప్రతి కౌన్సిలర్ సన్మానించారు. అందరం కలిసికట్టుగా బిచ్కుంద పట్టణ అభివృద్ధికి కృషి చేద్దామని ఈ సందర్భంగా చైర్పర్సన్ సీమా షెట్కార్ తెలిపారు. మొదటిసారి మున్సిపల్ గా మారిన తర్వాత పాలకవర్గం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. పార్టీలను మరిచి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామని కోరారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు అందరూ సమ్మతి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు, ఎంపీ సురేష్ షట్కార్ లను కలిసి ప్రత్యేక అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు కోసం కృషి చేద్దామని తెలిపారు.