బోనమెత్తిన బోధన్ ఆర్డీవో
21-07-2026 05:57 PM
బోధన్ పట్టణంలో ఆరే కటికె సంఘం బోనాలు పండుగ
బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలో ఆరే కటికె సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బోధన్ ఆర్డీవో ఏం.విజయ కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సాధారణ మహిళలతో కలిసి స్వయంగా బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా, భక్తి వాతావరణం నెలకొంది.






