నిరుపేదలకు అండగా కాంగ్రెస్ సర్కార్
17-07-2026 03:33 PM
సీఎం సహాయనిది చెక్కులు లబ్ధిదారులకు అందించిన వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉట్నూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిది చెక్కులు అందజేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అందజేశారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో రాసేవార్ రాదాబయికి రూ.60,000 చెక్కు,హీనా తబస్సు రూ.20,000, పర్వీనకు రూ.14,000 చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది అని,ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనేక పథకాలతో అండగా నిలుస్తుంది గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు,కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.






