17 July, 2026 | 3:41 PM

ఇసుక రీచ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు, రైతులు

17-07-2026 03:36 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ప్రతిపాదించిన ఇసుక రీచ్‌ను గ్రామస్తులు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు.ఇసుక తవ్వకాల వల్ల వ్యవసాయ భూములు దెబ్బతినే ప్రమాదం ఉందని, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు పర్యావరణానికి నష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక రీచ్ ఏర్పాటు కోసం అధికారులు చేపట్టిన చర్యలను గ్రామస్తులు, రైతులు అడ్డుకుని నిరసన తెలిపారు.

గ్రామానికి, వ్యవసాయానికి నష్టం కలిగించే విధంగా ఇసుక తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. వెంటనే ఇసుక రీచ్ ప్రతిపాదనను రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు గ్రామస్తులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.