17 July, 2026 | 3:19 PM

బాలికల విద్యే సమాజానికి అభివృద్ధి

17-07-2026 03:14 PM

జనగామ ఎమ్మెల్యే పల్లా  

చేర్యాల, జులై 17: చేర్యాల పట్టణంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ) నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి శుక్రవారం జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ కుమార్తెల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని బాలికల విద్య కుటుంబానికే కాదు,సమాజ అభివృద్ధికి కూడా బలమైన పునాది అని చదువే జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధం అని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల బాలికలు కూడా ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.