2 May, 2026 | 11:54 AM

అమ్మ తిట్టిందని గడ్డి మందు సేవించి యువకుడు ఆత్మహత్యాయత్నం!

02-05-2026 10:33 AM

అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసిన ఫర్టిలైజర్ దుకాణదారు. 

బిజినేపల్లి: చదువుకోవడం లేదని నిత్యం కాలక్షేపం చేస్తున్నావంటూ తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగు మందు( గడ్డి మందు) సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకోగా శనివారం వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇప్ప అచ్యుత్(19) అనే యువకుడు శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో మండల కేంద్రంలోని భాగ్యలక్ష్మి ట్రీడర్స్ లో కలుపు మందు కావాలన్నాడు.

సదురు డీలర్ ఎందుకు ఏమిటనే ప్రశ్నలు వెయ్యకుండానే స్వలాభం ఆశించి అధికారుల ఆదేశాలను సైతం భేకాతరు చేస్తూ నిషేధిత కలుపు మందు విక్రయించాడు. ఆ యువకుడు 10 గంటల ప్రాంతంలో కలుపు మందు తాగి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బందువులకు ఫోన్ చేసి చెప్పడంతో అప్రమత్తమై యువకుడిని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు

. సుదీర్ఘ అనుభవం ఉన్న ఫర్టిలైజర్ యజమాని పంటలన్నీ కోత దశలో ఉన్న సమయంలో గడ్డి మందు ఎందుకు వాడుతారో అన్న ఆలోచన మరిచి స్వలాభం ఆశించి నిషేధిత గడ్డి మందును విక్రయించడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారుల సైతం పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రతి దుకాణంలో ఇలాంటి నిషేధిత పురుగు మందులను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్. యశ్వంత్ రావు వివరణ కోరగా తక్షణమే క్షేత్ర స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు.