14 June, 2026 | 2:06 AM

పరాగ్వేను చిత్తు చేసిన అమెరికా

14-06-2026 12:44 AM

లాస్ ఏంజెల్స్, జూన్ 13 : సాకర్ ప్రపంచకప్‌లో ఆతిథ్య అమె రికా బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్‌లో పరాగ్వేను 4 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ మ్యాచ్‌లో అ మెరికా పూర్తి ఆధిపత్యం కనబరిచింది. మ్యాచ్ మొదలైన ఏడో నిమిషంలోనే అమెరికా గోల్స్ ఖాతా తెరిచింది. పరాగ్వే ఆటగాడు డామియన్ బొబాడిల్లా చేసిన పొరపాటు కారణంగా సెల్ఫ్ గోల్‌తో అమెరికాకు 1- లీడ్ దక్కింది. ఆ తర్వాత 31వ నిమిషంలో ఫోలారిన్ బలోగున్ అమెరికాకు రెండో గోల్ అందించాడు.

హాఫ్ టైమ్ ముగిసే సమయానికి బలోగున్ మరోసారి పరాగ్వే డిఫెండర్లను కన్ఫ్యూజ్ చేసి మరో గోల్ కొట్టాడు. దీంతో ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సరికి అమెరికా 3- ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్థభాగం 73వ నిమిషంలో పరాగ్వే ఆటగాడు మౌరిసియో గోల్ కొట్టాడు. దీంతో అమెరికా లీడ్ 3- తగ్గింది. ఇక్కడ నుంచి పరాగ్వే కాస్త పుంజుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆ తర్వాత అమెరికా డిఫెన్స్ ను దాటి పరాగ్వే ఆటగాళ్లు ముందుకు రాలేకపోయారు. ఇక మ్యాచ్ అదనపు సమయంలో అమెరికా ఆటగాడు జియో రేనా పెనాల్టీ బాక్స్ బయట నుంచి కళ్లుచెదిరే గోల్ కొట్టి స్కోరును 4- మార్చాడు. ఇది ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.