14 June, 2026 | 2:04 AM

టీ9 చాలెంజ్ సీజన్ 4 ప్రారంభం

14-06-2026 12:42 AM
  1. ట్రోఫీ ఆవిష్కరించిన చాముండేశ్వర్‌నాథ్
  2. టోర్నీలో పాల్గొంటున్న 12 జట్లు టీగోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టోర్నీ

హైదరాబాద్, జూన్ 13 : టీ గోల్ఫ్ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో టీ9 గోల్ఫ్ ఛాలెంజ్ నాలుగో సీజన్ ఉత్సాహంగా ప్రారంభమైం ది. దీనికి సంబంధించిన ట్రోఫీని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వర్ నాథ్, టీ గోల్ఫ్ ఫౌండర్ డాక్టర్ ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి, ఎమ్మార్ ప్రాపర్టీస్ సీఎఫ్ వో మధుసూదన్ రావు ఆవిష్కరించారు. మొత్త 12 జట్ల నుంచి 108 గోల్ఫర్లు ఈ సీజన్‌లో పాల్గొంటున్నారు. క్రికెట్‌లో టీ20 ఫార్మాట్ తరహా లోనే గోల్ఫ్ లో 9 హోల్ లీగ్ ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.

ఈ సీజన్‌లో బంకర్ బస్ట ర్స్, నోవాటెల్ స్టార్స్, చాముండి బౌల్డర్ హిల్స్ టైగర్స్, ఫెయిర్ వే వారియర్స్, హైదరాబాద్ గోల్ఫర్స్ యునైటెడ్, జాగృతి జాగ్వ ర్స్, విసాఫ్ట్ టైటాన్స్, రాజ్ పుష్ప ఇన్విక్టా, ఆర్డీ ఐరన్ ఈగల్స్, దాసోస్ బై మహి, శ్రీ మె ట్రిక్స్ ఈగల్స్, పార్ టైమర్స్ జట్లు పాల్గొంటున్నాయి. యువ గోల్ఫర్లకు ప్రోత్సాహకం గా గత మూడు సీజన్లను విజయవంతంగా నిర్వహించామనీ, ఈసారి ప్లేయర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని టీగోల్ఫ్ ఫౌండర్ డాక్టర్ ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీ గోల్ఫ్ అలియన్స్ జీఎం పాపిరెడ్డి, ఆర్టిలరీ సెంటర్ కమాండెం ట్ బ్రిగేడియర్ రాహుల్ మచ్రల్, గోల్ఫర్లు పాల్గొన్నారు. తొలి రౌండ్ పోటీల్లో పూల్ ఏ నుంచి పార్ట్ టైమర్స్ (3.5 పాయింట్లు), బం కర్ బస్టర్స్(3 పాయింట్లు), వీసాఫ్ట్ టైటాన్స్ (3 పాయింట్లు), పూల్ బి నుంచి జాగృతి జాగ్వర్స్ (2.5 పాయింట్లు), ఫెయిర్ వే వారియర్స్ (2.0 పాయింట్లు) సాధించాయి.