19 April, 2026 | 1:49 PM

ఇజ్రాయెల్‌ను ప్రశంసలతో ముంచెత్తిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

19-04-2026 12:15 PM

వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య ఇజ్రాయెల్ ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని, విధేయతను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఆదివారం ప్రశంస్తూ, దానిని అమెరికాకు మిత్రదేశంగా కొనియాడారు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ నిరంతరం అమెరికాకు అండగా నిలిచిందని ట్రంప్ ట్రూత్ సోషల్ అనే బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. ప్రజలు ఇజ్రాయెల్‌ను ఇష్టపడినా, ఇష్టపడకపోయినా, అది అమెరికా సంయుక్త రాష్ట్రాలకు గొప్ప మిత్రదేశంగా నిరూపించుకుందని, వారు ధైర్యవంతులు, సాహసవంతులు, విధేయులు, తెలివైనవారన్నారు.

సంఘర్షణ, ఒత్తిడి సమయంలో తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన ఇతరులలా కాకుండా, ఇజ్రాయెల్ గట్టిగా పోరాడుతుంది, ఎలా గెలవాలో దానికి తెలుసు! అని ట్రంప్ తెలిపారు. ఇరాన్ యుద్ధాన్ని విమర్శించి, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న అమెరికా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించిన దేశాలు  సంఘర్షణ, ఒత్తిడి సమయంలో తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాయని సూచిస్తూ, ట్రంప్ పలు నాటో మిత్రదేశాలపై కూడా విమర్శలు చేశారు. అమెరికా పక్షాన దృఢంగా నిలబడుతున్న ఇజ్రాయెల్‌తో దీనిని తీవ్రంగా పోల్చి చూపారు.