18 July, 2026 | 12:45 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి రాజీనామా

23-05-2026 02:01 AM

వాషింగ్టన్, మే ౨౨: అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డీఎన్‌ఐ) తులసీ గబ్బార్డ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. తన భర్త అబ్రహం బోన్ క్యాన్సర్ బారిన పడ్డారని, ఇలాంటి కష్టసమయంలో భర్తకు తోడుగా ఉండాలని నిశ్చయించుకుని తన కొలువుకి రాజీనామా చేసినట్లు తులసి స్పష్టం చేశారు. ఈ మేరకు వాషింగ్టన్‌లోని ఓవల్ ఆఫీస్‌లో తన నిర్ణయాన్ని ట్రంప్‌కు తెలియపరిచామని వెల్లడించారు.

కొలువుకు రాజీనామా చేసినప్పటికీ, ఆ దేశ నిబంధనల ప్రకారం ఆమె జూన్ 30 వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంది. మరోవైపు, తన భర్త ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను రాజీనామా చేస్తున్నట్లు తులసి ప్రకటించినప్పటికీ, వైట్‌హౌస్ నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే ఆమె రాజీనామా చేయాల్సి వచ్చిందని మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.