15 July, 2026 | 1:07 PM

Breaking News

'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •   శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు   •   జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గ్యాస్ లీక్‌తో మంటలు   •   ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలి   •   రూపాయి విలువ పెరిగింది.. 553 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు   •  

కామాఖ్య అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి

05-05-2026 04:51 PM

పుట్టిన రోజు సందర్భంగా అమ్మగారిని దర్శించుకున్న ఉప్పల

అస్సాం రాష్ట్రంలోని కామాఖ్య టెంపుల్( Kamakhya Ammavari Temple)లో తన పుట్టిన రోజు సందర్భంగా TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త(Uppala Srinivas Gupta) కుటుంబ సమేతంగా విశేష భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతదేశంలో అత్యంత ప్రాచీన శక్తిపీఠాలలో ఒకటైన ఈ పవిత్ర దేవాలయంలో అమ్మవారి దర్శనం పొందడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామునే దేవాలయానికి చేరుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, దేశ ప్రజల శాంతి, సుభిక్షం, కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి పుట్టినరోజు మన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ ప్రత్యేక రోజును దేవాలయంలో జరుపుకోవడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని నమ్ముతున్నాను. సమాజానికి సేవ చేయడం నా ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను” అని అన్నారు. అలాగే, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ పుణ్యక్షేత్ర దర్శనం తమకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ఉప్పల స్వప్న కుమారుడు ఉప్పల సాయి కిరణ్ కోడలు శార్వారీ చిన్న కుమారుడు ఉప్పల సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.