హజ్ యాత్రికులకు తీపి కబురు
హైదరాబాద్: పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో హజ్ యాత్ర భారంగా మారింది. ఈ నేపథ్యంలో యాత్రికులపై పడే భారాన్ని భరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నుంచి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో మక్కాకు హజ్ యాత్రకు వెళ్తుంటారు. ఈ ఏడాది సుమారు 7 వేల మంది హజ్ యాత్ర వెళ్లేందుకు నమోదు చేసుకున్నట్లు సమాచారం. పేద ముస్లింలు సైతం తమ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్‌కు వెళ్లాలనే లక్ష్యంతో ఎంతో కాలంగా పైసా పైసా జాగ్రత్తగా దాచుకుంటారు. ఆ మొత్తాన్ని ఉపయోగించుకొని హజ్ యాత్రకు వెళుతుంటారు. కానీ ఇరాన్-అమెరికా యుద్ధంతో ఇంధన ధరలు పెరగడంతో ఆ ప్రభావం హజ్ యాత్రపై పడి యాత్రికులపై భారం పెరిగింది. ఈ నేపథ్యంలో నిరపేద, మధ్యతరగతి మస్లిం సోదరులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హజ్ యాత్రికుల భారం భరించాలని నిర్ణయం తీసుకున్నారు.






