1 July, 2026 | 10:25 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం.. మహిళల ఉత్సాహంపై నీళ్లు

18-04-2026 04:56 PM
  1. కాంగ్రెస్ చారిత్రక తప్పిదం..
  2. మహిళలకు కాంగ్రెస్ మరోసారి అన్యాయం
  3. మహిళల ఉత్సాహంపై నీళ్లు చల్లారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మహిళలకు మరోసారి అన్యాయం చేసిందని ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలని గతంలో చేసిన చట్టంలోనే ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేలా మంచి ఫార్ములాను మోదీ తీసుకువచ్చారని వివరించారు.

బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ(Congress Party) చారిత్రక తప్పిదం చేసిందని ధ్వజమెత్తారు. వరసగా ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశ, నిస్పృహ కాంగ్రెస్ లో కనిపిస్తోందని పేర్కొన్నారు. మహిళలు, దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగే బిల్లును అడ్డుకుని తప్పు చేశారని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళల ఉత్సాహంపై నీళ్లు చల్లారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్ , ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ను కూడా అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడారని ఆరోపించారు. ప్రధాని మోదీని జాదుగర్ అంటూ రాహుల్ గాంధీ అవమానించారని ఫైర్ అయ్యారు. మూడు రోజుల పాటు నిర్వహించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా నిన్న లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే.