హెచ్‌పీవీ టీకాపై అపోహలు వీడాలి: జిల్లా వైద్యాధికారి కృష్ణ
29-07-2026 02:47 PM
జిల్లా వైద్యాధికారి కృష్ణ
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర బృందంతో కలిసి నిర్వహిస్తున్న హెచ్‌పీవీ టీకాకరణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా బాలికలకు హెచ్‌పీవీ టీకా ప్రాముఖ్యత, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో టీకా పాత్ర, టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి బాలిక తప్పనిసరిగా హెచ్‌పీవీ టీకా వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సురేష్‌బాబు, వైద్యాధికారి డాక్టర్ వాణి, ఎంఎల్‌హెచ్‌పీలు, పర్యవేక్షణ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.






