1 July, 2026 | 9:00 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నకిలీ కంపెనీలతో నిరుద్యోగుల వంచన

03-02-2026 12:30 AM

కాంగ్రెస్ ప్రభుత్వంపై కప్పాటి పాండురంగా రెడ్డి ఫైర్

కందుకూరు, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు ఒప్పందాలతో (MoUs) తెలంగాణ యువతను మోసం చేస్తోందని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గం లోని  కందుకూరు మండల కేంద్రం లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కేవలం కాగితాలకే పరిమితమైందని, వాస్తవంలో పెట్టుబడులేవీ రాలేదని ఆయన ఆరోపించారు.

ఉనికిలో లేని, అడ్రస్ లేని నకిలీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని  ఆయన మండిపడ్డారు. అమెరికా పర్యటనలో రూ. 1000 కోట్ల ఒప్పందం చేసుకున్న ’స్వచ్ బయో’ కంపెనీ, ఆ ఒప్పందానికి కేవలం రెండు వారాల ముందే పుట్టిందని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగాల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు దొంగ ఒప్పందాలతో నిరుద్యోగులను మరోసారి వంచిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఫోటోలకు ఫోజులివ్వడం మానేసి, చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.