calender_icon.png 20 February, 2026 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

19-02-2026 12:00:00 AM

హుజురాబాద్,ఫిబ్రవరి18: (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాసైదాపూర్ మండలం ఆకునూరు గ్రామం లో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వెనుక వైపు చెట్టుకు బత్తుల రమేష్ (45) అనే వ్యక్తి ఉరి వేసుకుని బుధవారం ఆత్మహత్య కు పా ల్పడ్డాడు.

రమేష్ తన కూతురు పై చదువుల కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం అప్పులు చేసిన ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి బయటకి వెళ్లి వస్తానని చెప్పిన తన భర్త ఇంటికి రాకపోవడంతో, బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు గాలిస్తుండగా చెట్టుకు ఉరివేసుకొని రమేష్ కనబడడంతో భార్య లక్ష్మి కన్నీరు మున్నీరు గా విలపించింది.

భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన రమేష్ గత 20 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం సైదాపూర్ మండలంరాయికల్ గ్రామానికి వలస వచ్చారు. రాయికల్ గ్రామంలో తన భార్య లక్ష్మి తో కలిసి కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసుకుంటూ వచ్చాడు. చేసినఅప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు వారు తెలిపారు. మృతుని భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.