18 March, 2026 | 5:50 PM

Breaking News

సుల్తానాబాద్‌లో ఉగాది సంబరాలు

18-03-2026 03:49 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని  శ్రీవాణి  డిగ్రీ , పీజీ కళాశాలలో బుధవారం ముందస్తు ఉగాది సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, భక్షాలు తయారు చేయడం వంటివి అతిథులను ఆకర్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా విద్యార్థులు వివిధ రకాల  వంటకాలను తయారు చేసుకుని వచ్చి ప్రదర్శించడం జరిగింది.

విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా బీఎస్సీ ఎంపీసీఎస్ రెండవ సంవత్సర విద్యార్థి రాజ్ కుమార్ కథాకళి గెటప్, అదేవిధంగా బీకాం రెండవ సంవత్సర విద్యార్థి రంజిత్ తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ గెటప్ అందరిని ఆకర్షించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక, విశిష్ట అతిథిగా విచ్చేసిన కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ  మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా నేర్పుతున్న అందుకు అధ్యాపక బృందాన్ని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ, ప్రిన్సిపల్ బండారి కమలాకర్ ,బాలసాని శ్రీనివాస్,  అధ్యాపక బృందం , విద్యార్థులు పాల్గొన్నారు....