12 July, 2026 | 5:49 PM

Breaking News

ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •  

ఉదయ బాబు సేవలు మరువలేనివి

17-11-2025 07:34 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యాశాఖలో వివిధ హోదాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మరియాల ఉదయ్ బాబు సేవలు మరువలేనివిగా నిలుస్తాయని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏసీఎంఓ పూర్కా ఉద్దవ్ అన్నారు. ఆసిఫాబాద్ పీఎంఆర్‌సీ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్కా ఉద్దవ్ మాట్లాడుతూ ఉదయ్ బాబు సార్ సేవలు గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఎప్పటికీ మరువదు. ఎన్నో బాధ్యతలను నిజాయితీ, నిబద్ధతతో నిర్వహించారు” అని అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం(TSTWTU) జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ మృదుసభావి, సౌమ్యుడు, పరోపకారి అయిన ఉదయ్ బాబు ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, డిప్యూటీ డీఈవో వంటి కీలక పదవుల్లో విశిష్ట సేవలు అందించారు.

సహోద్యోగుల మనసు నొప్పించకుండా అందరి మన్ననలు పొందారుని అన్నారు. జిల్లా క్రీడల అధికారి మడావి శేఖు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యా శాఖకు డిప్యూటీ డీఈవోగా అమూల్యమైన సేవలు అందించారు. గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అందరి ప్రేమాభిమానాలు పొందారు అని పేర్కొన్నారు.ఉపాధ్యాయ వర్గం వక్తలు మాట్లాడుతూ “విద్యాశాఖలో ఉత్తమ అధికారిగా నిలిచిన ఉదయ్ బాబు సేవలు ఆదర్శనీయం. రిటైర్ అయిన తరువాత కూడా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి మడావి శేఖు, బండ మీనారెడ్డి, TSTWTU జిల్లా కార్యవర్గ సభ్యులు కోశాధికారి కూడ్మేత ఆనంద్, కొమరం మాధవరావు, జాదవ్ ప్రఫుల్, పెందూర్ విశ్వేశ్వర్, చాహకటి శ్యాంరావ్, ధర్మారావ్, రవీందర్, పీఎంఆర్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.