4 March, 2026 | 5:10 PM

సూర్యాపేటలో కారు బీభత్సం: చెట్లలోకి దూసుకెళ్లి ఇద్దరి దుర్మరణం

04-03-2026 03:43 PM

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా(Suryapet District) మునగాల మండలం ఆకుపాముల వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు పల్టీలు కట్టి దావీద్, వంశీ అనే ఇద్దరు అక్కడి కక్కడే మరణించారు. బాధితులు అనంతగిరి మండలం మొగలాయికోటలో అత్యక్రియలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.


ఇవీ చదవండి:

తిరుమల లడ్డూ నెయ్యి వివాదం: ఏపీ మండలిలో వైఎస్సార్‌సీపీ–టీడీపీ వాగ్వాదం

ఢిల్లీకి సీఎం రేవంత్.. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కసరత్తు

బాచుపల్లి అగ్నిప్రమాదం: ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఈటల