calender_icon.png 7 February, 2026 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుకుడోజీ మహారాజ్ సమ్మేళనం

07-02-2026 08:44:13 PM

హాజరైన ఎమ్మెల్యే కోవలక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): కేరమేరి మండలం గొయగాం గ్రామంలో రాష్ట్రసంత్ తుకుడోజీ మహారాజ్ అంతరాష్ట్ర సమ్మేళనం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ తుకుడోజీ మహారాజ్ అందించిన సామాజిక ఐక్యత, సమానత్వ సందేశం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజల్లో మమేకమయ్యారు.

విభిన్న రాష్ట్రాల ప్రజల కలయికతో ఈ సమ్మేళనం మతసామరస్యం, భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందన్నారు.తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో సమ్మేళన ప్రాంగణం భక్తిభావంతో నిండిపోయింది.