హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకలు పంపండి: ట్రంప్
చమురు సహా వాణిజ్య నౌకల భద్రత కోసం.. కూటమి ఏర్పాటు
హార్ముజ్ జలసంధిపై ఆధారపడాల్సిన అవసరం అమెరికాకు లేదు
వాషింగ్టన్: హార్ముజ్ జలసంధి(Strait of Hormuz) విషయంలో ఏడు దేశాల అధినేతలతో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) తెలిపారు. హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు యుద్ధనౌకలను పంపించాలని కోరినట్లు వెల్లడించారు. చమురు సహా వాణిజ్య నౌకల భద్రత కోసం కూటమి ఏర్పాటు చేస్తామని ట్రంప్ సూచించారు. కూటమి ఏర్పాటుపై వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేశారు.
అమెరికా వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. హార్ముజ్ జలసంధిపై ఆధారపడాల్సిన అవసరం అమెరికాకు లేదని తేల్చిచెప్పారు. చైనా 90 శాతం చమురును హార్ముజ్ జలసంధి నుంచే పొందుతోందని ట్రంప్ తెలిపారు. హార్ముజ్ జలసంధిలో దేశ నౌకలకు ఎదురవుతున్న రవాణా అంతరాయాలను తగ్గించడంలో ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సహాయపడతాయని తాను ఆశాభావంతో ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.




