త్రివేణి కళాశాల విజయకేతనం
భద్రాచలం, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ బోర్డు ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో చర్ల రోడ్లోని త్రివేణి జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు.
ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో వనారసి చందు (464/470) మార్కులతో డివిజన్ స్థాయిలో అగ్రగామిగా నిలవగా, బచ్చలకూరి డింపుల్ (454), కొండ ప్రణదీప్ (452) ఉత్తమ మార్కులు సాధించారు. సి ఈ సి విభాగంలో బడ్డి భవ్య హర్షిణి (439/500) ప్రతిభ కనబరిచారు.
ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో పిలక ఐశ్వర్య (983/1000), గుమ్మడి నాగ సాయి యశ్వంత్ (977), ఎ యశ్వంతి (968), పి.శృతి (956), పి.భవ్య సాయి సింధు (952), డి.డింపుల్ సాయి వెంకట నందిని (944), యు.ఐశ్వర్య (944), వై.మేఘన జ్యోతి (944) అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు, బైపిసి విభాగంలో వడ్డి కాత్యాయని (944), కడియాల మేఘన (934), పి. రుహిత తన్మయ్ దుర్గ (933), సి ఈ సి విభాగంలో దుర్వే సిద్దు (912) మంచి ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కోడూరి సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మెజారిటీ విద్యార్థులు 400 మరియు 900 పైచిలుకు మార్కులు సాధించడం గర్వకారణమని తెలిపారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణే ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శ్రీమతి కోడూరి ప్రశాంతి , ప్రిన్సిపాల్ శ్రీకాంత్ , వైస్ ప్రిన్సిపాల్ అనిల్ మరియు అధ్యాపక బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు.




