దమ్మాయిగూడ–నాగారం 100 ఫీట్ల రోడ్డును 80 ఫీట్లకు కుదించాలి
ఏనుగు సంజీవరెడ్డి అధ్యక్షతన సమావేశం
జవహర్ నగర్, ఆగస్టు 23 (విజయక్రాంతి): దమ్మాయిగూడ నుంచి నాగారం వరకు ప్రతిపాదిత 100 ఫీట్ల రోడ్డు విస్తరణను 80 ఫీట్లకు కుదించాలని స్థానికులు కోరారు. ఈ మేరకు ఏనుగు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోడ్డు విస్తరణపై చర్చించారు.
100 ఫీట్ల రోడ్డు విస్తరణతో స్థానికుల ఇళ్లు, ప్లాట్లు, ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారి అభివృద్ధి చేపట్టాలని, 100 ఫీట్లకు బదులుగా 80 ఫీట్ల రోడ్డును ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి, రోడ్డు విస్తరణ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని ఏనుగు సంజీవరెడ్డి కోరారు. స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






