12 July, 2026 | 2:46 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

కైలాస్ బచ్చన్ మహారాజ్‌కు సన్మానం

17-02-2026 12:00 AM

ఆలయ నిర్మాణానికి గ్రానైట్, స్టీల్ అందజేసిన సామాజిక వేత్త

హైదరాబాద్, ఫిబ్రవరి 16(విజయక్రాంతి): గోడేకి కబాడీ 2 బీహెచ్కే డిగ్నిటీ కాలనీ హరి నగర్‌లో ఉన్న చారిత్రాత్మకమైన శివాలయం  పునర్నిర్మాణం కోసం గ్రానైట్, స్టీల్‌ను సామాజిక వేత్త కైలాస్ బచ్చన్ మహారాజ్, ఉచితంగా అందజేసి నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణంలో జై భీమ్ నవయుక్ సంఘ అధ్యక్షులు, అడ్డాకుల లక్ష్మణ్ మాదిగ, ఉపాధ్యక్షులు ఏ రాజ్ కుమార్, జనరల్ సెక్రెటరీ బాబురావు, కోశాధికారి బబ్లుల నేతృత్వంలో కైలాష్ బచ్చన్ మహారాజును ఘనంగా శాలువాతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా అడ్డాకుల లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ కైలాస్ బచ్చన్ మహారాజ్, ఎంతో ఉదార స్వభావంతో, శివాలయం నిర్మాణానికి, ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. గతంలో కైలాస్ ఆరోగ్య పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అతని భార్య ఇక్కడికి వచ్చి మహా శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తన భర్తను ప్రాణాలు కాపాడితే, ఆలయానికి తమ వంతు సహాయం అందిస్తామని, మహాశివుని ప్రార్థించారని ఆయన తెలిపారు. ఆ మహా శివుడి అనుగ్రహం వల్ల, కైలాస్ బచ్చన్ మహారాజ్, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నాడని, ఈ సందర్భంగా అడ్డాకుల లక్ష్మణ్ గుర్తు చేశారు. కార్యక్రమంలో  కార్యవర్గ సభ్యులు అఖిల్, ఎస్ రమేష్, దాస్, జి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.