1 July, 2026 | 6:38 PM

Breaking News

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •  

హలో ఆదివాసి ఛలో ఉట్నూర్ జయప్రదం చేయాలి

18-11-2025 04:50 PM

ఆదివాసీ మండల అధ్యక్షులు కోరెత తిరుపతి

బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసి భవనంలో ఆదివాసీల ధర్మ యుద్ధం పోస్టర్లను ఆదివాసి నాయకులు ఆవిష్కరించారు. అనంతరం ఆదివాసి మండల అధ్యక్షులు కోరిత తిరుపతి మాట్లాడుతూ ఆదివాసి బచావో లంబాడా హటావో అనే ప్రధాన నినాదంతో ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని ఏకైక డిమాండ్ తో ఈనెల నవంబర్ 23వ తేదీన ఉట్నూర్ మండల కేంద్రంలో ఎంపీడీవో గ్రౌండ్ లో ధర్మ యుద్ధం పేరిట భారీ బహిరంగ సభను 9 తెగల ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ అధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని వారు తెలియజేస్తూ ఉట్నూర్ మహా సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సిడం సాకారం, వ్యవస్థాపక అధ్యక్షులు కుర్సింగా ఓం ప్రకాష్, సర్మెడి కొడప శంకర్, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆత్రం బక్కయ, కోయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మెస్రం రాజారాం, ఆదివాసీ మహిళ అధ్యక్షరాలు ఎనుకా అమృత, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మెడి సతీష్, ప్రచార కార్యదర్శి సడ్మేక రమేష్, మాజీ సర్పచులు కొమురం హన్మంతు, కర్పేత రమేష్, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల శ్యామ్ రావు, కొలవార్ మండల ఉపాధ్యక్షులు మనేపెళ్లి మల్లేష్, ఆదివాసీ నాయకులు కోరేత లలయ్య, ఆత్రం గంగారాం, ఆత్రం రాజారాం, పురుషోత్తం, నైతం సత్తయ్య, పేదం శ్రీహరి, ఏనుక శ్రీహరి, గెడం నందరం, కొడిపె వెంకటేష్, తోరెం వినోద్, సిడం షణ్ముఖ, జిల్లా సహాయక కార్యదర్శి పోల్కా వెంకటేష్, గవుడే గణేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.