5 May, 2026 | 5:37 PM

అద్భుతంగా మంథని - ముత్తారం-ఖమ్మంపల్లి ప్రధాన రహదారి

05-05-2026 04:27 PM

గత రెండేళ్ల నుంచి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డ  మండల ప్రజలు

రోడ్డు నిర్మాణంతో ప్రయాణికుల ఆనందం

మంత్రి శ్రీధర్ బాబుకు మండల ప్రజల కృతజ్ఞతలు

ముత్తారం,(విజయక్రాంతి): అద్భుతంగా మంథని- ముత్తారం, ఖమ్మంపల్లి ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి అవుతుంది.  గత రెండు సంవత్సరాలుగా మండల ప్రజలు రోడ్డు సౌకర్యం సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముత్తారం నుంచి మంథనికి, ముత్తారం మండల కేంద్రం నుంచి ఖమ్మంపల్లికి వెళ్లే రహదారులు గుంతలమయమై ప్రయాణికులు ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముత్తారం మండల పై ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపు రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేయడంతో మండల కేంద్రాన్ని కలుపుతూ ఖమ్మంపల్లి, ముత్తారం, ఓడేడు, ముత్తారం నుండి మంథనికి డబుల్ లైన్ రోడ్డు మంజూరు చేసి పనులు కొనసాగిస్తున్నారు.

మంథని-  ముత్తారం ప్రధాన రహదారి నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఏండ్లుగా రోడ్డు గుంతల మయం కావడంతో రవాణా సౌకర్యం సరిగా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముత్తారం మండల కేంద్రం నుంచి మంథని వెళ్లాలంటే ప్రజలు నరకం అనుభవించేవారు దీంతో కేశనపల్లి  నుంచి వయా బేగంపేట్ మీదుగా మంథని కి వెళ్లేవారు. దీంతో ప్రయాణభారం పెరిగెది. ప్రజల ప్రయాణ కష్టాలను గుర్తించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నుండి ముత్తారం, ఓడేడు వరకు దాదాపు రూ. 60 కోట్లతో డబుల్ రోడ్డును మంజూరు చేశారు.

దీంతో సదరు కాంటాక్ట్ మంత్రి ఆదేశాల మేరకు హుటాహుటిన మంథని మండలం గంగాపురి నుంచి ముత్తారం, ఓడేడు వరకు పనులు ప్రారంభించారు.  దీంతో చక చక పనులు కొనసాగుతూ మండల కేంద్రం వరకు రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. త్వరలోనే ఓడేడు వరకు రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో మండల ప్రజలు మంత్రి శ్రీధర్ బాబుకు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.