10 August, 2026 | 2:41 PM

స్మశాన వాటిక విద్యుత్ సరఫరాకు యువ నాయకుడు కృషి

10-08-2026 01:28 PM

ఎమ్మెల్యే పోచారం ఆదేశాలతో కదిలిన ట్రాన్స్ కో అధికారులు

బాన్సువాడ, ఆగస్టు 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోనీ స్మశాన వాటికకు  గత కొన్ని రోజుల నుంచి కరెంట్ సరఫరా లేక  పోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. చూసి ఇది గమనించిన బీర్కూర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మియాపూర్ శశికాంత్ విద్యుత్ సరఫరా అంతరాయం సమస్యను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం బీర్కూర్ స్మశాన వాటికలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని అవసరమైన చర్యలు వేగవంతం చేసి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకురావాలని బీర్కూరు ట్రాన్స్ కో ఏఈ కి ఆదేశించారు.

దీంతో ట్రాన్స్ కో ఏఈ విద్యుత్ సిబ్బందితో కలిసి సోమవారం పనులను ప్రారంభించారు.సాయంత్రం లోగా బీర్కూర్ స్మశాన వాటికలో కరెంట్ సరఫరా ప్రారంభమవుతుందని విద్యుత్ దీపాలు వేలుగుతాయని ఏఈ తెలిపారు. ఎమ్మెల్యే పోచారం దృష్టికి తీసుకువెళ్లి యుద్ధం సరఫరాను పునరుద్ధరిస్తున్న యువ నాయకుడు శశికాంత్ కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమములో ఉపసర్పంచ్ పరమేష్ పంతులు,విఠల్ సర్,దుంపలరాజు,సెక్రటరీ గంగారాం,వార్డ్ మెంబెర్ ఆనంద్ ,రఘు,ప్రశాంత్,గాంధీ,అశోక్,పృథ్వీ కాంట్రాక్టర్ శ్రీను తదితరులు ఉన్నారు.