10 August, 2026 | 3:45 PM

కోటగుళ్లలో ప్రొఫెసర్ డాక్టర్ నవీన్ కుమార్ దంపతుల పూజలు

10-08-2026 02:20 PM

గణపురం, ఆగస్టు10 (విజయక్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో సోమవారం పర్వదినం సందర్భంగా జగిత్యాల వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు నాగరాజు వారిని శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ గోశాలలో పనిచేస్తున్న పాణిగంటి గణేష్ కు 24 వేల వేతనాన్ని ప్రొఫెసర్ దంపతులు అందజేశారు.