ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించిన సునీల్ రావు
ముకరంపుర, ఆగస్టు 10(విజయక్రాంతి): భారతస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సోమవారం తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ దేశ ప్రజలందరిలో జాతీయ భావాన్ని, దేశభక్తిని మరింతగా పెంపొందించే అద్భుతమైన కార్యక్రమం హర్ ఘర్ తిరంగా అని అన్నారు.పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై విధిగా తమ తమ ఇళ్లపై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.






