21 August, 2026 | 3:53 AM

ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లకు శిక్షణ

21-08-2026 01:04 AM

గణపురం,ఆగస్టు 20 (విజయ క్రాంతి): ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6 నుండి 8వ తరగతులకు సంబంధించిన స్వచ్ఛంద సేవకులకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సృజనాత్మక విద్యా కార్యక్రమాలపై స్వచ్ఛంద సేవకులకు ప్రాయోగికంగా శిక్షణ అందించారు.

విద్యార్థుల్లో ఆసక్తి, సృజనాత్మకత, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, లక్ష్మణ్ రెడ్డి డి ఆర్ ఎల్  రఘు సిఐఎంఎస్,  మండల కవిత, మండల సందీప క్రియేటివిటీ క్లబ్ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.