7 March, 2026 | 11:40 AM

టాక్సిక్ వాయిదా

07-03-2026 12:00 AM

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ వాయిదా పడింది. ప్రస్తుతం పలు దేశాల మధ్య యుద్ధం నెలకొన్న కారణంగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మార్చి 19న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌తోపాటు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ చేయబోతు న్నారు. ఓవర్సీస్‌లో ప్రధాన పంపిణీ భాగస్వామి ఫార్స్ ఫిలమ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడటంతో విడుదలను వాయిదా వేశారు. మార్చి 8న బెంగళూరులో ట్రైలర్ లాంచ్ కోసం నిర్మాతలు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ని కూడా వాయిదా వేశారు. ఇలా అన్ని ప్రమోషనల్ కార్యక్రమాలను ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం నిలిపివేసింది. ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యశ్, నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. యశ్ రచన, గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.