9 May, 2026 | 1:09 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

నేడు తుది విడత పంచాయతీ పోరు

17-12-2025 12:25 AM
  1.   3,752 సర్పంచ్, 28,410 వార్డులకు పోలింగ్
  2. నోటిఫై చేసిన వాటిలో 4,159 గ్రామాలు, 36,452 వార్డులు
  3.   394 సర్పంచ్, 7,908 వార్డులు ఏకగ్రీవం
  4. స్టేతో రెండు గ్రామాలు, 18 వార్డులకు ఎన్నిక నిలిపివేత

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామంలో తుది విడత పోలింగ్ బుధవారం జరగనుంది. ఈ మూడో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉద యం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానున్నది. ఈ మూడో విడత ఎన్నికలకు 4,159 గ్రామ పంచాయతీలను నోటిఫై చేయగా 11 చోట్ల సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డులకు 116 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 394 సర్పంచ్ స్థానాలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

దీంతో మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాలకు 12,652 మంది, 28,410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నామినేషన్ వేసిన గ్రామాల్లోనూ రెండు సర్పంచ్ స్థానా లు, 18 వార్డులకు వివిధ కారణాలతో స్టే ఉం డటంతో ఎన్నికలు వాయిదా వేశారు. ఈ తుది విడతలో 53,06,401 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 26,01,861, మహిళలు 27,04,394, ఇతరులు 140 మంది ఓటర్లు ఉన్నారు.